పంచదార్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం | - | Sakshi
Sakshi News home page

పంచదార్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం

Feb 21 2026 7:11 AM | Updated on Feb 21 2026 7:11 AM

పంచదార్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం

పంచదార్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం

ఎయిమ్‌ ప్రతినిధులు హెచ్చరిక

రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలం పంచదార్లకు చెందిన దళితకుటుంబాలకు చెందిన అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అఽధికారులు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే వారికి న్యాయం జరిగే వరకూ రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌(ఎయిమ్‌) సభ్యులు హెచ్చరించారు. పంచదార్లలో దళితులు నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని వారు శుక్రవారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని, ప్రాణత్యాగాలకై నా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 50 ఏళ్ల క్రితం దళిత కుటుంబాలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలనే ఆలోచన ఎందుకొచ్చిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. పరిహారం ఇవ్వకుండా ఢీ పట్టా భూములను లాగేసుకునే ఉత్తర్వులు ఇవ్వడం చాలా దా రుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిమ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కెల్లా భీమారావు, సభ్యులు గొంది అప్పారావు, మెరుగు శేఖర్‌, నారాయణప్పడు, గుడాల నాగరాజు, శివలంక అప్పారావు, అలమండ గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement