‘ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అన్యాయం’
అనకాపల్లి: విద్యుత్ బస్సుల పేరిట ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం అన్యాయమని ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి పి.ఎన్.వి. పరమేశ్వరరావు అన్నారు. స్థానిక డిపో గ్యారేజీ గేటు వద్ద స్టాఫ్ అండ్ వర్కర్స్‌ఫెడరేషన్(ఆర్టీసీ) డిపో అధ్యక్షుడు బత్తిన అప్పారావు ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనవిరామ సమయంలో శుక్రవారం ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.వి.శ్రీనివాస్, రుత్తల శంకరరావు మాట్లాడుతూ 100 శాతం ఆర్టీసీ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలని జీవో ఇచ్చిందని, ఇందులో భాగంగా నెల్లూరు–2, గుంటూరు–2, విద్యాధరపురం, మంగళగిరి డిపోలను పూర్తిగా గాజువాక, కాకినాడ, కడప, అనంతపురం, కర్నూలు డిపోల్లో సంగం గ్యారేజీ స్థలాన్ని పినాకిల్ కంపెనీకి అప్పగించే విధంగా చర్యలు చేపట్టారని చెప్పారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం మానుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కన్వీనర్లు కె. తేలయ్యబాబు, ఎస్ డబ్ల్యూఎఫ్ డిపో నాయకులు ఎస్.రామ త్రిమూర్తులు, ఎస్.రమణ, జి.ఏ.రావు, తదితరులు పాల్గొన్నారు.


