నిజాయితీ చాటుకున్న మహిళ
రూ.59 వేలతో దొరికిన బ్యాగ్ అప్పగింత
గొలుగొండ: ఓ మహిళ తన నిజాయితీ చాటుకుంది. తనకు దొరికిన బ్యాగ్‌తోపాటు రూ.59 వేలను పోలీసులకు అప్పగించింది. అల్లూరి జిల్లా బాలారం గ్రామానికి చెందిన గొర్లి నాగమణి తన అత్తవారి ఇంటికి కోటవురట్లకు బైక్‌పై గురువారం వెళ్తుండగా, గొలుగొండ మండలం చోద్యంలో భారీ వంతెన వద్ద హ్యాండ్‌బ్యాగ్ జారి పడిపోయింది. ఈ క్రమంలో అటుగా పొలానికి వెళ్తున్న చోద్యం గ్రామానికి చెందిన ఈర్లి లక్ష్మికి ఆ బ్యాగ్ దొరికింది. దాన్ని కృష్ణదేవిపేట పోలీసులకు అప్పగించింది. బ్యాగ్‌లో ఉన్న కార్డులు ఆధారంగా నాగమణిదిగా పోలీసులు గుర్తించారు. అప్పటికే చాలా చోట్ల వెతుకుతున్న ఆమెను గుర్తించి లక్ష్మి సమక్షంలో శుక్రవారం అందజేశారు. నిజాయతీ చాటుకున్న లక్ష్మికి ఎస్‌ఐ రుషికేశ్వర్రావు, స్థానికులు అభినందనలు తెలిపారు.


