పరిహారం చెల్లించకుండా ఇళ్లు కూల్చివేతా? | - | Sakshi
Sakshi News home page

పరిహారం చెల్లించకుండా ఇళ్లు కూల్చివేతా?

Feb 21 2026 7:11 AM | Updated on Feb 21 2026 7:11 AM

పరిహారం చెల్లించకుండా ఇళ్లు కూల్చివేతా?

పరిహారం చెల్లించకుండా ఇళ్లు కూల్చివేతా?

బుచ్చిరాజు పేటలో అడ్డుకున్న నిర్వాసితుడు

నక్కపల్లి: స్టీల్‌ప్లాంట్‌ కోసం భూములు, నివాస ప్రాంతాలు త్యాగం చేసిన నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించకుండా ఇళ్లు ఎలా కూలుస్తారని కాళ్ల కృష్ణ అనే నిర్వాసితుడు ఆందోళనకు దిగాడు. శుక్రవారం బుచ్చిరాజుపేటలో తన ఇంటిని జేసీబీ సాయంతో కూల్చడాన్ని అడ్డుకుని నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇంటిని ఖాళీ జాగాను ఏపీఐఐసీ వారు స్టీల్‌ప్లాంట్‌ కోసం తీసుకున్నారన్నారు. నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ప్యాకేజీ ఇవ్వకుండా ఉన్నపళంగా ఇల్లు కూల్చి వేరొక చోటకు వెళ్లిపోవాలని అధికారులు చెబుతున్నారని వాపోయాడు. పరిహారం కోసం అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆగ్రహించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement