సాగర సంగ్రామ దీక్ష రేపు
దీక్ష వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న
గోపీనాథ్, ఉపాధ్యాయులు
నర్సీపట్నం: ఏపీసీపీఎస్‌ఈఏ ఈ నెల 22న తలపెట్టిన సాగర సంగ్రామ దీక్ష విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ కోరారు. దీక్ష వాల్ పోస్టర్లను ఆయన యూనియన్ నాయకులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ హామీని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కురచా రమణ, నర్సీపట్నం మండల అధ్యక్షుడు ఎ.వరహాలనాయుడు. జిల్లా ట్రైబల్ ఎంప్లాయీస్ యూనియ న్ ప్రధాన కార్యదర్శి ధర్మరాజు పాల్గొన్నారు.


