షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
రూ.10 లక్షల ఆస్తినష్టం
కాలిపోయిన ఇంటి లోపలి భాగం
ఎస్.రాయవరం: మండలంలోని తిమ్మాపురంలో షార్ట్ సర్క్యూట్‌కారణంగా ఓ ఇంట్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. అందిన సమాచారం మేరకు నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు వీఆర్వో నూకరాజు తెలిపారు.ఎస్‌ఐ విభీషణరావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, కేసు నమోదు చేశారు.


