అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
పోలీసు స్టేషన్‌కు తరలించిన కలపతో వ్యాను
తాండవ, మాధవనగరం మధ్య పట్టుబడిన వ్యాన్
నాతవరం: అటవీశాఖ అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్నట్టు నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఇటీవల మండలంలో పలు ప్రాంతాల్లో కోళ్లు, మేకలు, గొర్రెలు చోరీకి గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వాటిని నివారించే చర్యల్లో భాగంలో సిబ్బంది బృందాలుగా విడిపోయి గురువారం రాత్రి గ్రామాల్లో గస్తీ నిర్వహించినట్టు తెలిపారు. అలాగే తాండవ, మాధవనగరం, వెదురుపల్లి, ఆడాకుల రూట్‌లో వాహనాలు తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో వచ్చిన వ్యాన్‌ను తనిఖీ చేసి, కలప అక్రమణంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు. మూడు టన్నుల నలుపు రంగు కలిగిన తమ్మెద కర్ర మానులు లభించాయన్నారు. అటవీశాఖ అధికారులు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని చెప్పారు. వాహనంతో పాటు నిందితుడు గొలుగొండ మండలానికి చెందిన ప్రసాద్ పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. అనంతరం డీఎఫ్‌వోకు సమాచారం అందజేసినట్టు ఆయన చెప్పారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకునేంత వరకు వాహనం, దుంగలతో పాటు నిందితుడు ప్రసాద్ పోలీసుల ఆధీనంలో ఉంటాడని ఎస్‌ఐ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత


