విద్యుత్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి
మృతుడిది నేపాల్
రావికమతం: మండలంలోని గొంప గ్రామంలో శుక్రవారం సాయంత్రం సరుగుడు లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై డ్రైవర్ మృతి చెందాడు. రావికమతం ఎస్‌ఐ రఘవర్మ, స్థానికుల కథనం మేరకు.. నేపాల్ దేశానికి చెఽందిన పారాదీప్‌కు వివాహం కాలేదు. బంధువులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. కొన్నాళ్ల కిందట పెందుర్తికి వచ్చి లారీ ఓనర్ సాలాపు సముద్రం దగ్గర క్లీనర్‌గా చేరాడు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ నేర్చుకుని అతడి దగ్గరే ఉంటున్నాడు. శుక్రవారం సరుగుడు కలప తీసుకెళ్లేందుకు ఓనర్‌తో కలిసి పెందుర్తి నుంచి లారీతో గొంప వచ్చాడు. ఇక్కడ చెట్టువాని చెరువు దగ్గర కూలీలు లారీకి సరుగుడు కలప లోడు చేశారు. లోడుకు సపోర్టుగా ఇరువైపులా సరుగుడు కర్రలు కట్టారు. ఆ కర్రలు కటింగ్ చేయాలని కూలీలు చెప్పగా, తట్టబంద వద్ద తూనిక కాటా వద్ద చేద్దామని చెప్పి లారీని చెరువులో నుంచి రోడ్డుపైకి తీసుకొచ్చే క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. కర్రలు తొలిగించే ప్రయత్నం చేస్తున్న పారాదీప్ విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాత పడ్టాడు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. లారీ యజమాని సముద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


