బడ్జెట్‌లో ఉద్యోగులకు నిరాశే..
పీఆర్సీ చెల్లింపులకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను దగా చేసింది. పీఆర్సీ కమిషన్ గడువు ముగిసి రెండున్నరేళ్లు కావస్తున్నా నేటికీ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించకపోవడం శోఛనీయం. నాలుగు డీఏలు, ఇతర బకాయిలు చెల్లింపులపై బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోగా మరో బడ్జెట్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.3.22 లక్షలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉపాధ్యాయులు, ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. మధ్యంతర భృతి గురించి ప్రస్తావన లేదు. అధికారంలోకి వచ్చి మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం. ఇప్పటికై నా ప్రభుత్వం పీఆర్‌సీ కోసం నిధులు కేటాయించాలి. – ఎం.చిట్టియ్య, యూటీఎఫ్ నర్సీపట్నం డివిజన్ నాయకులు


