బాకై ్సట్‌పై ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

బాకై ్సట్‌పై ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి

Feb 19 2026 9:49 AM | Updated on Feb 19 2026 9:49 AM

బాకై ్సట్‌పై ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి

బాకై ్సట్‌పై ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి

● ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స డిమాండ్‌

పాడేరు రూరల్‌: బాకై ్సట్‌ తవ్వకాలపై కూటమి ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స హెచ్చరించారు. బుధవారం ఆదివాసీ గిరిజన సంఘ కార్యాలయంలో ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. బాకై ్సట్‌ వ్యతిరేక ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. ఆదివాసీల చట్టాలను, హక్కులను కాలరాస్తూ గిరిజన ప్రాంతాల్లోని బాకై ్సట్‌ వంటి ఖనిజ సంపదను లూటీ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అప్పలనర్స ఆరోపించారు.

పార్టీల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ, ఆదివాసీ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన సలహా మండలి తక్షణమే బాకై ్సట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా ఆదివాసీలకు నూరుశాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అరకు, చింతపల్లి ప్రాంతాల్లో బాకై ్సట్‌ తవ్వకాలు జరిపితే ఆదివాసీలు సర్వస్వం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ పేరుతో అక్రమంగా లీజులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. మైనింగ్‌ ద్వారా రూ. 1.50 లక్షల కోట్ల పెట్టుబడులు, 60 వేల ఉద్యోగాలు వస్తాయనే ప్రచారంలో వాస్తవం లేదని, ఇది కేవలం ప్రజలను భ్రమల్లో ఉంచడానికి మోదీ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. ఈ నెల 21న జిల్లా కలెక్టర్‌కు ఆదివాసీ ప్రతినిధుల బృందంతో వినతిపత్రం అందజేయనున్నట్లు వారు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు ధర్మన పడాల్‌, పోతురాజు, చిన్నారావు, మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement