క్రీడలతో మానసిక ఉల్లాసం
జి.మాడుగుల: క్రీడలు మాసికి ఉల్లాసానికి ఎంతో దోహదపడాతాయని, గిరిజన యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని క్రీడల్లో ఉన్నత స్థానాలకు రాణించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఏఎస్సార్ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. మండలంలో సొలభం పంచాయతీ గొందిపాడు గ్రామంలో శ్రీవేములమ్మ తల్లి జాతర మహోత్సవాలు సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. మొదటి మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించిన ఆయన ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని ఉత్సాహ పరిచారు. గిరిజన ప్రాంతాల్లో జరిగే జాతరల్లో నిర్వహకులు క్రీడా పోటీలు ఏర్పాటుచేసిన యువతను క్రీడల్లో ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐసరం హనుమంతరావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు, ఎస్టీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కిల్లో కోటిబాబు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బోనంగి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం


