వైభవంగా గంగమ్మతల్లి ఉత్సవాలు
ముంచంగిపుట్టు: మండలంలోని పాత,కొత్త సుజనకోట గ్రామాల్లో గంగమ్మతల్లి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి అఽధిక సంఖ్యల్లో భక్తులు శతకం పట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు ఘటాలను మోసుకొని వెళ్లి సమర్పించారు. రాత్రి గిరిజన ఆచార సంప్రదాయ ప్రకారం బుడియాలు సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చంఎదిన భక్తులు పోటెత్తారు. మొక్కులు సమర్పించుకున్నారు. ఉత్సవ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. సీఆర్‌పీఎఫ్ పోలీసులు గస్తీ నిర్వహిస్తూ, నిరంతరం పర్యవేక్షించారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర పాత, కొత్త సుజనకోటలో గంగమ్మతల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


