నిరుద్యోగ భృతి ఏదీ?
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా సరే నిరుద్యోగ భృతి ఊసెత్తలేదు. ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందిస్తామని, జాబ్ కేలండర్ విడుదల చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఊదరగొట్టారు. ఈ సారి బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా నిరుద్యోగులకు కేటాయించకుండా నమ్మక ద్రోహం చేశారు. విజయవాడ, హైదరాబాద్ వెళ్లి అక్కడ కోచింగ్ ఫీజులు చెల్లించలేకపోతున్నారు. దీంతో కోచింగ్ మధ్యలో వదిలేసి నిరుద్యోగులు తిరిగి వెనక్కి వస్తున్నారు.
–ఎడ్ల హేమంత్ కుమార్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు, మాడుగుల


