పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో
వాడచీపురుపల్లి పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో హైమావతి
పరవాడ: మండలంలోని వాడచీపురుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) హైమావతి మంగళవారం సందర్శించారు. జిల్లాలో అమలవుతున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని శత శాతం పూర్తిచేసేలా కృషి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. సిబ్బంది బయోమెట్రిక్ విధానాన్ని విధిగా పాటించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈహెచ్‌ఆర్ విధానాన్ని క్రమం తప్పకుండా పాటించాలని సూచించారు. ఆమె వెంట వైద్యాధికారులు రంజిత్, కనకఅప్పారావు, ఫాతిమా బేగమ్, ఎంపీహెచ్‌ఈవో గణేష్ ఉన్నారు.


