కేజీబీవీ విద్యార్థులకు డార్మిటరీ సదుపాయం
విద్యార్థినులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
అచ్యుతాపురం రూరల్ : యోకోహమా పరిశ్రమ సీఎస్‌ఆర్ నిధులతో స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు రెండు డార్మిటరీలు నిర్మించి వారు నిద్రించేందుకు 120 బంకర్ బెడ్లను జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోకోహమా పరిశ్రమ హెచ్‌ఆర్ రెడ్డి, డీఈఓ జి.అప్పారావు నాయుడు, ఎంఈఓ సీహెచ్. దేవరాయల్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్.ఉమాదేవి, విద్యార్థినులు పాల్గొన్నారు.


