నాచు కల్టివేషన్‌తో ఎంతో మేలు
సముద్రంలో వేసిన నాచు సీడ్‌ను పరిశీలిస్తున్న అధికారులు
అచ్యుతాపురం రూరల్ : సముద్రంలో వేసిన నాచు సీడ్‌ను మంగళవారం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి, ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ విజయ పరిశీలించారు. మహిళలకు మెరుగైన జీవనోపాధి, పిల్లలకు పెద్దలకు పోషకాహారాలు కలిగించే నాచు కల్టివేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సముద్రంలో వేసిన నాచు సీడ్ ఏ విధంగా ఉందన్న విషయమై అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం ఎస్.శ్రీనివాసరావు, గ్రామ నాయకులు వంక కృష్ణారావు, ఫిషరీస్ అసిస్టెంట్ శ్రావణి, దేముడు, వీఓఏ శ్రీను పాల్గొన్నారు.


