రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కోటవురట్ల: రోడ్డు ప్రమాదంలో కొడవటిపూడి గ్రామానికి చెందిన పెదపాటి సత్యవతి(55) మృతి చెందింది. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మాకవరపాలెంలోని తన కుమారుడు పెదపాటి బ్రహ్మాజీ ఇంటికి సోమవారం వెళ్లింది. తిరిగి కుమారుడితో కలిసి స్కూటీపై మంగళవారం స్వగ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో కె.వెంకటాపురం దాటాక జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో స్కూటీ సడన్ బ్రేక్ వేయడంతో ఆమె అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న సత్యవతి తలకు తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతురాలికి భర్త నారాయణరావు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త నారాయణరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


