జేఈఈ మెయిన్స్‌లో గురుకుల విద్యార్థి ప్రతిభ
దేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ గురుకులం విద్యార్థి కణితి కామరాజు జేఈఈ మెయిన్స్–2026లో ప్రతిభ చాటాడు. తెనుగుపూడి గురుకులం సెకండియర్ ఎంపీసీ విద్యార్థి కామరాజు ఈ ఫలితాల్లో 63 పర్సంటైల్ స్కోర్ సాధించాడు. ఉత్తరాంధ్ర గురుకుల విద్యాలయాలకు చెందిన 27 మంది విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాపురంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన 27 మందిలో కేవలం కామరాజు మాత్రమే త్వరలో జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించాడు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్‌పాల్ మంగళవారం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. చోడవరం మండలం తిమ్మన్నపాలెంలో నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి తండ్రి తన నాలుగేళ్ల ప్రాయంలోనే మరణించగా, తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది.


