రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో ప్రతిభ
ప్రతిభ చూపిన విద్యార్థులతో కరస్పాండెంట్ రాంప్రసాద్
మాకవరపాలెం: రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో స్థానిక మోంటిస్సోరి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ నెల 14న విజయవాడలో విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. వీటిలో జూనియర్ విభాగంలో విజువలైజేషన్ కేటగిరీలో రుత్తల వెంకటగంగాకామేష్ జీనియస్, సీనియర్ విభాగంలో బి.యోగఅమృత రైజింగ్ స్టార్ స్థానాలను కై వసం చేసుకున్నారని పాఠశాల కరస్పాండెంట్ కె.రాంప్రసాద్ మంగళవారం తెలిపారు. వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.


