జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన గౌతమ్
గౌతమ్‌ను అభినందిస్తున్న తల్లిదండ్రులు కొండలరావు, జయసంతోషి
మాడుగుల రూరల్ : జేఈఈ మెయిన్స్ పరీక్షలో మండలంలో ఎం.కె.వల్లాపురం గ్రామానికి చెందిన అద్దిపల్లి గౌతమ్ 97.16 శాతం మార్కులు సాధించి తన ప్రతిభను కనపరిచారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలు సోమవారం విడుదల చేశారు. గౌతమ్ విశాఖపట్నం, ఆనంతపురం, కె.కె.ఆర్.గౌతమ్ పాఠశాలల్లో 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివాడు. అతని తండ్రి కొండలరావు విలేఖరిగా గతంలో పనిచేశారు. తల్లి జయసంతోషి. కాగా జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన గౌతమ్‌ను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.


