నిరుద్యోగ భృతి ఏదీ ?
అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు వాగ్దానాలతో ఊదరగొట్టారు. ఉద్యోగాలు వచ్చేవరకూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, యువత ఓట్లతో గెలుపొందారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఉద్యోగ కల్పన లేదు.. నిరుద్యోగ భృతి లేదు. గిరిజన ప్రాంతాల్లోను సుమారు రెండు లక్షలకు పైగా అర్హులైన గిరిజన నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం యువతను మోసగించినట్టే.
–పి.బాలదేవ్, గిరిజన సంఘం నేత. అరకులోయ


