రూ.కోటి గంజాయి పట్టివేత
కొయ్యూరు: మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో కొయ్యూరు,మంప పోలీసులు సుమారు రూ.కోటి విలువైన 185 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, ఎసఐ కిషోర్‌వర్మ చీడిపాలెం జంక్షన్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో వచ్చిన మినీ వ్యాన్‌లో ఇద్దరు.. పోలీసులను చూసి పరారవుతుండగా పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసి, ప్రత్యేకంగా చేయించిన అరలో పెట్టి రవాణా చేస్తున్న 83 ప్యాకెట్లలోని 182.99 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో సరకుమంద నుంచి ధారకొండ,గూడెం,పెదవలస బూదరాళ్ల మీదుగా తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఒడిశాలో సరకు బందకు చెందిన వంతల ప్రసాద్,చైన్నెకు చెందిన శంకర్‌లపై ఎన్‌డీపీసీ చట్టం కింద కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు
బూదరాళ్లలో 2.2 కిలోలు స్వాధీనం
ముందుగా వచ్చిన సమాచారం మేరకు సోమవారం
బూదరాళ్లలో మంప ఎస్‌ఐ సీదరి శ్రీనివాస్ వాహనా ల తనిఖీ చేపట్టారు. ధారకొండ నుంచి స్కూటీపై వస్తున్న ఇద్దరు.. పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించారు వారిని పట్టుకుని, స్కూ టీలో తరలిస్తున్న రెండు కిలోల 215 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, అనపర్తికి చెందిన జగరపు సాయి కుమార్, పులిగా విజయరాజ్‌లను అరెస్ట్ చేశారు.వారిపై గతంలో అనపర్తి స్టేషన్‌లో గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ చెప్పారు.
రూ.కోటి గంజాయి పట్టివేత
రూ.కోటి గంజాయి పట్టివేత


