గంగమ్మతల్లి జాతరకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

గంగమ్మతల్లి జాతరకు పటిష్ట భద్రత

Feb 17 2026 7:38 AM | Updated on Feb 17 2026 7:38 AM

గంగమ్మతల్లి జాతరకు పటిష్ట భద్రత

గంగమ్మతల్లి జాతరకు పటిష్ట భద్రత

జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు

ముంచంగిపుట్టు: సుజనకోట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు తెలిపారు.మండలంలోని కొత్త,పాత సుజనకోట గ్రామాల్లో సోమవారం రాత్రి జరిగే గంగమ్మతల్లి జాతర ఏర్పాట్లను మండల స్థాయి అధికారులతో కలిసి సీఐ పరిశీలించారు.ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి పలు సూచనాలు చేశారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని,ముఖ్యంగా రాత్రిపూట జాతరలో డ్రోన్‌ కెమెరాతో పర్యవేక్షిస్తామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు,పార్కింగ్‌,మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ భాస్కరఅప్పారావు,సర్పంచ్‌ రమేష్‌,ఎస్‌ఐ నాని,ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement