నమ్మించి మోసం చేశారు..
ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని చంద్రబాబు, కూటమి నాయకులు హామీ ఇచ్చారు. దీంతో మహిళలందరూ కూటమి పార్టీలకు ఓట్లు వేసి గెలిపించారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ‘ఆడబిడ్డ నిధి’ ఊసే లేదు. ఇప్పటికే ఒక్కో మహిళ రూ.30 వేల వరకు నష్టపోయింది. ఈ బడ్జెట్‌లో కూడా ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే మహిళలను నమ్మించి మోసం చేశారని అర్థమవుతోంది. ఓట్ల కోసం ఆశలు కల్పించి, గెలిచిన తర్వాత ఇలా మొండిచేయి చూపడం తగదు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
–బురిడి సుమిత్ర, గిరిమహిళ, పెద గంగగుడ్డి గ్రామం, అరకులోయ మండలం


