బైక్‌ అదుపుతప్పిన ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పిన ప్రమాదంలో యువకుడి మృతి

Feb 17 2026 7:38 AM | Updated on Feb 17 2026 7:38 AM

బైక్‌ అదుపుతప్పిన ప్రమాదంలో యువకుడి మృతి

బైక్‌ అదుపుతప్పిన ప్రమాదంలో యువకుడి మృతి

కె.కోటపాడు: మండలంలో సూర్రెడ్డిపాలెం కూడలి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వేపాడ మండలం నీలకంఠరాజుపురం గ్రామానికి చెందిన బండారు దేముడునాయుడు (30) మృతి చెందాడు. సబ్బవరంలో స్వీట్‌ పాపులో పని చేస్తున్న దేముడునాయుడు షాపునకు వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనంపై సోమవారం తెల్లవారుజామున బయలుదేరాడు. బైక్‌పై సూర్రెడ్డిపాలెం గ్రామం దాటుతుండగా బైక్‌ అదుపు తప్పి పడిపోవడంతో దేముడునాయుడు తలకు తీవ్రగాయమై సంఘటనా స్థలంలోనే మరణించాడు. దుర్ఘటన విషయం తెలిసి తల్లిదండ్రులు భవానీ, రాము సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో వీరు గుండెలు విలసెలా రోధించడం స్థానికులను కంటతడి పెట్టించింది. కుమారుడు మృతిపై తల్లి భవానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎ.కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కె.కోటపాడు సీహెచ్‌సీలో దేముడునాయుడు మృతదేహనికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement