మంటల్లో చిక్కుకుని మహిళ మృతి
అనకాపల్లి: స్థానిక గూడ్స్ రోడ్డు రైల్వే స్టేషన్ ప్రహరీ వద్ద రేకులషెడ్‌లో నిద్రిస్తున్న లింగాల తలుపులమ్మ(45) మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. ఆదివారం రాత్రి ఆమె జెట్‌కాయిల్ వెలిగించుకుని మంచం కింద పెట్టుకుని పడుకుంది. చిన్నపాటి మంట రేకులషెడ్‌కు అంటుకుని వ్యాపించడంతో అటుగా వెళ్తున్న వారు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే తలుపులమ్మ మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. ఆమె కుమార్తె లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని బోరుమంది. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఏఎస్‌ఐ పి.డి.సుందమ్మ చెప్పారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.
మానవత్వం చాటుకున్న జాజుల రమేష్...
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, 83వ వార్డు ఇన్‌చార్జి జాజుల రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. అంత్యక్రియలకు సహాయం అందించారు.


