దళిత రైతుల భూముల రక్షణ కోసం పోరాడుతాం | - | Sakshi
Sakshi News home page

దళిత రైతుల భూముల రక్షణ కోసం పోరాడుతాం

Feb 17 2026 7:38 AM | Updated on Feb 17 2026 7:38 AM

దళిత రైతుల భూముల రక్షణ కోసం పోరాడుతాం

దళిత రైతుల భూముల రక్షణ కోసం పోరాడుతాం

రాంబిల్లి(అచ్యుతాపురం): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రాజు తెలిపారు. రాంబిల్లి మండలం పంచదార్లలో దళితుల దీక్షా శిబిరాన్ని సోమవారం ఆయన ఎస్సీ సెల్‌ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత కుటుంబాలకు 1978లో ఇచ్చిన డీ పట్టా భూముల్ని స్థానిక టీడీపీ నేత కుట్ర పన్ని ఎటువంటి పరిహారం ఇవ్వకుండా లాక్కోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఐడీ బాబు మాట్లాడుతూ దళిత భూముల పరిరక్షణ కోసం వైఎస్సార్‌ సీపీ ఎంతవరకై నా పోరాడుతుందని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు సుజాత, ఎస్సీ సెల్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ ప్రకాష్‌, రేబాక రాము, అప్పారావు, రాజు, నాగప్పారావు, ఈశ్వరరావు, దేవుడు నాయుడు, జయలక్ష్మి, ప్రనన్న తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు

సురేష్‌రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement