అథ్లెటిక్స్‌లో రామలక్ష్మణదొరకు పతకాలు | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌లో రామలక్ష్మణదొరకు పతకాలు

Feb 17 2026 7:38 AM | Updated on Feb 17 2026 7:38 AM

అథ్లెటిక్స్‌లో రామలక్ష్మణదొరకు పతకాలు

అథ్లెటిక్స్‌లో రామలక్ష్మణదొరకు పతకాలు

రోలుగుంట: జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో రోలుగుంట మండలం కంచుగుమల పంచాయతీకి చెందిన పరవాడ రామలక్ష్మణదొర(68) సత్తా చాటాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ నెల 14న నిర్వహించిన 45వ జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో పలు దేశాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీ పడిన ఆయన రన్నింగ్‌, హైజంప్‌లో విజేతగా నిలిచాడు. నిర్వాహకుల నుంచి పతకాలు, ధ్రువపత్రాలను అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో బ్యాంకు ఉద్యోగం చేస్తున్నప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించానన్నారు. రిటైర్డ్‌ అయ్యాక తనకు ఆటపై మరింత మక్కువ పెరిగిందని, భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement