జేఈఈ మెయిన్స్‌లో కుసుర్లపూడి విద్యార్థి ఘనత
రోలుగుంట : సోమవారం విడుదలైన జెఈఈ మెయిన్స్ ఫలితాల్లో మండలంలోని కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థి మేడపురెడ్డి ఽశ్యామ్ కృష్ణకు 99.59 పర్సంటైల్ సాధించాడు. దీనిపై కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శెట్టి మోహన్‌రావు, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది హర్షం ప్రకటించారు. శ్యామ్‌కృష్ణ జానకీరాంపురం గ్రామం రైతు కుటుంబానికి చెందిన మేడపురెడ్డి ముసలినాయుడు, లక్ష్మి దంపతుల కుమారుడు. వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించారు. జానకీరాంపురం ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ కుసుర్లపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి పది పరీక్షల్లో 560 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచాడు. జేఈఈ పోటీ పరీక్షలు రాసి మెయిన్స్‌లో 99.59 పర్సంటేజి తెచ్చుకున్నాడు. ఎన్‌ఐటీ వరంగల్లో సీఎస్‌ఈ బ్రాంచి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


