నిరుద్యోగులకు దగా...
కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి మోసం చేసింది. నిరుద్యోగులకు ఏడాదికి రూ. 3వేలు హామీని అటకెక్కించారు. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సైతం నిరుద్యోగ భృతి పథకం అమలకు నిధులు కేటాయించకుండా నిలువునా ముంచింది. యువతకు ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఊరు వాడా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక యువతను పట్టించుకోక పోవడం అత్యంత దారుణం. భృతి నగదు జమ చేస్తే కొంత మేర ఆర్థిక ఆసరా కలుగుతుందని ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగ యువతకు చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది.
–కర్రి సూరినాయుడు, మామిడిపల్లి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు


