పవర్ కెనాల్‌కు నీటి విడుదల
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌లోని డొంకరాయి పవర్ కెనాల్‌కు నిర్వహణ పనులు పూర్తయిన నేపథ్యంలో దశలవారీగా నీటిని విడుదల చేస్తున్నట్టు ఇన్‌చార్జి ఎస్‌ఈ హనుమ తెలిపారు.
మొదట ట్రయల్ రన్ కోసం 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం (బుధవారం నాటికి) 11 అడుగుల మేర అంటే సుమారు 3300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కెనాల్ సామర్థ్యాన్ని పరీక్షిస్తూనే, ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయేమోనని కెనాల్ పెట్రోలింగ్ సిబ్బంది నిశితంగా గమనిస్తున్నారు.


