భద్రాద్రి రామయ్యకుఘనంగా రాపత్తు సేవ
ఎటపాక: ముక్కోటి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారికి శుక్రవారం ఘనంగా రాపత్తు సేవ నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారిని భద్రాద్రి రామాలయం నుంచి పల్లకిపై కోలాటాలతో, రంగవల్లుల మధ్య ఊరేగింపుగా మండలంలోని పురుషోత్తపట్నం రామాలయానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో స్వామి వారికి రాపత్తు సేవ నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజాకార్యక్రమాల సందర్భంగా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, కుందూరు రామిరెడ్డి, రామచంద్రరావు, ఆకుల శ్రీనివాస్, రవితేజ, శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, ఏడుకొండలురెడ్డి, జయచంద్రరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.


