
కళ తప్పిన పర్యాటక ప్రాంతాలు
● తగ్గిన సందర్శకుల సంఖ్య
చింతపల్లి: ఆంధ్రా కశ్మీరు లంబసింగికి ఆదివారం పర్యాటకుల రాక తగ్గింది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పాలసముద్రాన్ని తలపించిన మంచు అందాలను తిలకించారు. తాజంగి జలాశయ సంద్శకుల సంఖ్య తగ్గింది.
డుంబ్రిగుడ: ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం ఆదివారం పర్యాటకులు రాకపోవడంతో బోసిపోయింది. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నందున పర్యాటక ప్రదేశాలు తెరచుకోని కారణంగా పర్యాటకుల రాక తగ్గిందని స్థానికులు తెలిపారు.

కళ తప్పిన పర్యాటక ప్రాంతాలు