
పక్కాగా మధ్యాహ్న భోజన పథకం అమలు
రంపచోడవరం: ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీవో విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యతోనే ఉన్నత స్థాయికి చేరువోవచ్చన్నారు. కళాశాల మైదానంలో చెత్తచెదారం లేకుండా ఎప్పకప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు.
రంపచోడవరం పీవో కట్టా సింహాచలం