
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
చింతపల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు ఆరోగ్యకర వాతావరణం ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ్ ఝాన్సీరామ్ అన్నారు. గురువారం రాత్రి ఆమె స్థానికంగ ఉన్న గిరిజన బాలసదనాన్ని సందర్శించారు. విద్యార్థుల గదులు, వంటశాల, సామగ్రి, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యలో రాణించేలా ఆశ్రమంలో స్టడీ హవర్ ఏర్పాటు చేయాలన్నారు. బాలసదనంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీడీపీవో శ్రీదేవిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీవో సద్దు, కౌన్సిలర్ జాహ్నవి, సూపర్‌వైజర్ జయభారతి, ఇన్‌చార్జ్ విజయలక్ష్మి, అకౌంటెంట్ వసంత పాల్గొన్నారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్
ఝాన్సీరామ్ ఆదేశం
చింతపల్లిలో బాలసదనం సందర్శన
విద్యార్థులతో కలిసి భోజనం