
84.42 శాతం మేర పింఛన్ల పంపిణీ
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రానికి 84.42 శాతం మేర సామాజిక పింఛన్ల పంపిణీ చేశారు. జిల్లాలో 1,23,046 మంది పింఛనుదారులు ఉండగా, తొలిరోజు 1,03,875 మందికి పంపిణీ చేశారు. కొత్తగా మంజూరైన 1824మంది వితంతువుల పింఛన్ల పంపిణీని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్‌గౌడ మినుములూరులో ప్రారంభించారు. పలువురి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సామాజిక పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నకుమారి, సర్పంచ్ లంకేల చిట్టమ్మ, వెలుగు ఏపీడీ మురళీ, వీఆర్వో సంధ్య పాల్గొన్నారు.