
అంగన్‌వాడీ కేంద్రాలకు ట్యాబ్‌లు ఇవ్వాలి
కొయ్యూరు: అంగన్‌వాడీ కేంద్రాలకు ట్యాబ్‌లు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాజేంద్రపాలెంలో నిర్వహించిన అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వర్కర్ల వేతనాన్ని నెలకు రూ.26 వేలకు పెంచాలని కోరారు. మినీ కేంద్రాలను ప్రధాన సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను తిరిగి సీడీపీవోలకు ఇచ్చేయ్యాలని వర్కర్లకు సూచించారు.అన్ని యాప్‌లను కలిపి ఒక దానిలో ఉంచాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు.