
ఉపాధ్యాయుల్లేని పాఠశాల
● కొమ్ములువాడలో
రెండు నెలలుగా మూత
● ఆందోళనకు దిగిన
విద్యార్థుల తల్లిదండ్రులు
సీలేరు: గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కొమ్ములువాడలో రెండు నెలలుగా పాఠశాల తెరచుకోలేదు. ఇక్కడ ఒకటి నుంచి 5వ తరగతి వరకు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు బదిలీ అయింది. వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో పాఠశాల మూతపడి ఉంటోంది. దీనివల్ల తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. తక్షణమే పాఠశాల తెరిపించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.