
న్యూస్‌రీల్
మెరుగైన వైద్యం అందించండి
ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు
పాడేరు: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో క్యాజువాల్టీతో పాటు వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న పౌష్ఠికాహారంపై ఆరా తీశారు. అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వచ్చే రోగులను వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి తగిన వైద్య చికిత్స అందించాలన్నారు. ఆయన వెంట జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర, వైఎస్సార్‌సీపీ వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మా రాంబాబు, వైఎస్సార్‌సీపీ నాయకుడు తెడబారికి సురేష్‌కుమార్ పాల్గొన్నారు.