
తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలదే
సాక్షి,పాడేరు: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యత పిల్లలపైనే ఉందని అసిస్టెంట్ కలెక్టర్ కనల చిరంజీవి నాగ వెంకట సాహిత్ అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో పలుశాఖల అఽఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను తీసుకుని వారిని వదిలేయడం, జీవనాధారం లేకుండా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. పట్టణ ప్రాంతాల్లో జీవనాధారం లేక యాచిస్తున్న వృద్ధుల దృశ్యాలు ఆవేదన కలిగిస్తున్నాయన్నారు. సమాజంలో సీనియర్ సిటిజన్లను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులకు కనీస అవసరాలు, వసతితో కూడిన భోజనం, వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత కన్న పిల్లలదేనన్నారు. సీనియర్ సిటిజన్ల రక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. డీఆర్వో కె.పద్మలత మాట్లాడుతూ విద్యాసంస్థల్లో తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షరణపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు,వయో వృద్ధుల సంక్షేమశాఖ ఏడీ కవిత మాట్లాడుతూ 70 ఏళ్లు పైబడిన వృద్ధులు ప్రధాన మంత్రి వయో వందన యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాఽధికారి నందు, డీఈవో బ్రహ్మజీరావు, సర్వేశాఖ ఏడీ దేవేంద్రుడు, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి అప్పారావు, జిల్లా పరిశ్రమలశాఖ అధికారి రవిశంకర్, డ్వామా పీడీ విద్యాసాగర్, జిల్లా పంచాయతీ అఽధికారి పి.చంద్రశేఖర్, సీఐ ధీనబంధు, హెరిటేజ్ పౌండేషన్ సంస్థ ప్రతినిధి టి.రవి తదితరులు పాల్గొన్నారు.
అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్