గిరి యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 8:54 AM | Updated on Feb 25 2023 2:54 PM

యువతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పాడేరు ఎమ్మెల్యే  భాగ్యలక్ష్మి - Sakshi

యువతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

గూడెంకొత్తవీధి: మండలంలోని పెదవలస పంచాయతీ రంపుల గ్రామంలో సత్యశ్రీ (25)అనే గిరిజన యువతి గురువారం తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొయ్యూరు మండలం చుట్టుబంద గ్రామానికి చెందిన దుచ్చరి సాగర్‌ అనే యువకుడు తనను మూడేళ్లుగా ప్రేమించి, ఇప్పుడు వేరొకరిని వివాహం చేసుకుంటున్నాడని తెలిసి మనస్థాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు సంఘటన స్థలంలో లభించిన లేఖ ద్వారా తెలిసిందని స్థానిక పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వారు చెప్పారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి శుక్రవారం యువతి మృతదేహాన్ని పరిశీలించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కుమారి, పెదవలస సర్పంచి వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement