ఈనాడు.. అసత్య కథనాలు మానుకో | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 8:54 AM | Updated on Feb 25 2023 2:01 PM

ఈనాడు ప్రతులను తగులబెడుతున్న ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పార్టీ శ్రేణులు  - Sakshi

ఈనాడు ప్రతులను తగులబెడుతున్న ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పార్టీ శ్రేణులు

అరకులోయ రూరల్‌: కట్టుకథలతో ఈనాడు పత్రికలో రామోజీరావు ప్రచురిస్తున్న అసత్య రాతలు మానుకోవాలని ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సూచించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలతో కలిసి ఈనాడు ప్రతులను తగులబెట్టి రామోజీరావు, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ పట్టాభిని కొట్టారంటూ ప్రచురించిన కథకాల్లో ఫొటోలను మార్ఫింగ్‌ చేయడాన్ని అందరూ గమనించారన్నారు. వైఎస్సార్‌సీపీకి అన్ని వర్గాల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.

జర్నలిజం వ్యవస్థను రామోజీరావు, చంద్రబాబు భ్రష్ట పట్టిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాలేదన్నారు. రాజకీయంగా ప్రభుత్వాన్ని చేసేదేమీ లేకపోవడంతో తప్పుడు రాతలతో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, మండల కన్వీనర్‌ పట్టాసి సంపత్‌కుమార్‌, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి హస్తినాకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement