పుట్టిన మూడు రోజులకే, ఒళ్లంతా గాయాలు..

Neonatal Baby Suffered From Perinatal Asphyxia Need Eight Lakh Rupees For Treatmen - Sakshi

కడుపులో బిడ్డం అడ్డం తిరగడంతో బాధ భరించలేకపోతోంది పుష్ప. ఆమెను వెంటనే ఆస్పతత్రికి తీసుకెళ్తున్నాడు ఆమె భర్త శరవణన్‌. ఆ దంపతులకు ఇంతకు ముందే ఓ బిడ్డ ఉన్నా పుట్టుకతోనే ఒకే కిడ్నీకి కలిగి ఉంది. దీంతో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండి దినదిన గండంగా ఆ బిడ్డ బతుకుతుంది. ఇప్పుడో రెండో బిడ్డ భూమి మీదకు రాకుండానే తల్లి కడుపులో ఆపసోపాలు పడుతోంది. మరోవైపు పుట్టబోయే బిడ్డకు ఏమీ కావొద్దని దేవుళ్లను మొక్కుకుంటున్నాడు శరవణన్‌. ఇంతలో ఆస్పత్రి వచ్చేసింది.

పుష్సను పరిశీలించిన డాక్టర్లకు పరిస్థితి అర్థమైంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా తల్లిబిడ్డల ప్రాణాలకు ప్రమాదమని గ్రహించారు. వెంటనే సీ సెక్షన్‌ చేసి పుష్పకు పురుడు పోశారు. పుష్ప, శరవణన్‌ దంపతులకు మలి కాన్పులో ఆడపిల్ల కలిగింది. అయితే వారికి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఆ పసిపాప శరీరం పెలుసుగా మారుతూ నీలి రంగులోకి మారడం మొదలైంది, కంగారు పడిన తల్లిదండడ్రులు డాక్టర్లను పిలిచారు. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

నెలలు నిండకుండానే పుట్టినందు వల్ల పుష్ప కూతురికి అరుదైన పెరినాటల్‌ ఆస్‌ఫైక్సియా అనే వ్యాధి వచ్చినట్టు డాక్టర్లు తేల్చారు. దీంతో పాప శరీరం వెనువెంటనే పెలుసుగా మారిపోతుంది. ఒళ్లంతా గాయాలు అయినట్టుగా నొప్పి పెడుతోంది. ఆ బాధ భరించలేక చిన్నారి గుక్క పట్టి ఏడవని క్షణం లేదు. ఆ బిడ్డను కష్టాన్ని చూసి పుష్ప, శరవణన్‌లకు కన్నీరే మిగిలింది. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

పాపాను నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్యం బాగయ్యే వరకు చికిత్స అందివ్వాలంటే ఎనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శరవణన్‌ ఆ డబ్బు సర్థుబాటు చేయలేనని తెలుసు. మరోవైపు కన్న కూతురి బాధను చూసి ఉండలేకపోతున్నారు శవరణన్‌, పుష్పలు. దీంతో పాప ఆరోగ్య ఖర్చుల కొరకు ఫండ్‌ రైజింగ్‌ సంస్థ కెట్టోను సంప్రదించారు. పుష్ప, శరవణన్‌ల చిన్నారి పాప తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే మీ వంతు సాయాన్ని కెట్టో ద్వారా అందివ్వగలరు.  డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top