ఆదిలాబాద్: వచ్చే నెల 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఖేలో ఆదిలాబాద్ సీజన్–4 పోటీలను జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాల ని ఎంపీ నగేశ్ అన్నారు. ఈ మేరకు పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను అసోసియేషన్ ప్రతి నిధులతో కలిసి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా అథ్లెటిక్స్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో, వీజీఎస్ డిఫెన్స్ అ కాడమీ ఆతిథ్యంలో నవంబర్ 2, 3 తేదీల్లో ఆ దిలాబాద్ ఐపీ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 2న అథ్లెటిక్స్, 3న షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో పో టీలు ఉంటాయని పేర్కొన్నారు. అండర్–12, అండర్–14, అండర్–16 బాలబాలికల విభా గాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించా రు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, వెంకట్ స్వా మి, రాజేశ్, వీజీఎస్ రాకేశ్ పాల్గొన్నారు.
దుర్గామాత ఆలయంలో ఎంపీ పూజలు
తాంసి: మండల కేంద్రానికి సమీపంలో భవాని గిరి గుట్టపై ఉన్న దుర్గామాత ఆలయంలో ఎంపీ నగేశ్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్స వం పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు పోచ్చ న్న ఆధ్వర్యంలో నవచండీ, రుద్ర హోమం చేపట్టారు. ఎంపీతో పాటు సీనియర్ సివిల్ జడ్జి హుస్సేన్, విజయ డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి వెర్వేరుగా దర్శించుకున్నారు. వారి వెంట సర్పంచ్ సంతోష్‌రెడ్డి, కృష్ణ తదితరులున్నారు.


