కై లాస్‌నగర్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) డైరెక్టర్ రాజేందర్ శుక్రవారం జిల్లాకు విచ్చేశారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ రాజర్షి షా పూలమొక్క అందజేసి స్వాగతం పలికా రు. అనంతరం జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు. అనంతరం కలెక్టర్‌ను డైరెక్టర్ సన్మానించి జ్ఞాపిక అందజేశారు.


