● 853 యూనిట్లు సేకరణ ● స్వయంగా రక్తదానం చేసిన ఎస్పీ ● పోలీసుల మెగా రక్తదాన శిబిరానికి స్పందన | - | Sakshi
Sakshi News home page

● 853 యూనిట్లు సేకరణ ● స్వయంగా రక్తదానం చేసిన ఎస్పీ ● పోలీసుల మెగా రక్తదాన శిబిరానికి స్పందన

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

● 853 యూనిట్లు సేకరణ ● స్వయంగా రక్తదానం చేసిన ఎస్పీ ● పోలీసుల మెగా రక్తదాన శిబిరానికి స్పందన

ఆదిలాబాద్‌టౌన్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, యువత, పోలీసు సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని మొత్తం 853 యూ నిట్లు దానం చేశారు. సేకరించిన రక్తాన్ని రిమ్స్‌ బ్లడ్‌ బ్యాంక్‌కు అందజేశారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం విశేషం. ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రజలు, యువత, పోలీసు సిబ్బంది, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్‌ రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, వైద్యులు, రిమ్స్‌ సిబ్బంది, పట్టణ సీఐలు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎన్జీఓ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకుల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అమరులను స్మరించి.. రక్తదానం చేసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement