కైలాస్‌నగర్: జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పర్యవేక్షక బృందంతో కలిసి ఎయిర్‌పోర్ట్ భూసేకరణ పనుల పురోగతిపై శుక్రవారం సమీక్షించారు. విమానాశ్ర య విస్తరణకు అవసరమైన భూసేకరణ పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. సమన్వయంతో పనిచేస్తూ భూ సేకరణకు సంబంధించిన అన్ని అంశాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలన్నారు. నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పరిహారం, పునరావాస ప్రయోజనాలు స త్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎయిర్‌ఫోర్స్ పర్యవేక్షక బృందం సభ్యులు కెప్టెన్ రాకేశ్, ఎస్‌ఆర్ సింగ్, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ప్రభాకర్, ము న్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.
పారదర్శకంగా జనాభా లెక్కింపు
రెండోదశ జనాభా లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రా జర్షి షా ఆదేశించారు. స్థానిక టీటీడీసీలో సబ్ డివి జన్ చార్జ్ స్థాయి అధికారులకు రెండు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. ప్రతీ ఇల్లు,ప్రతి కుటుంబం,ప్రతి పౌరుడి వివరాలను పొ రపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు. సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు వ్యవహరించాలన్నారు. ఇందులోజిల్లా కోఆర్డినేటర్ కృష్ణయ్య, డీ ఆర్వో స్రవంతి,సూపరింటెండెంట్ నలంద ప్రియ, మాస్టర్ ట్రెనర్లు వెంకటరమణ పాల్గొన్నారు.
ఆరుతడి సాగుపై అవగాహన కల్పించాలి
కై లాస్‌నగర్: ఎల్‌నినో నేపథ్యంలో రబీలో రైతులు నష్టపోకుండా ఆరుతడి పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రబీ సాగు, వాతావరణ పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. నీటి లభ్యత దృష్ట్యా సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును ప్రో త్సహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డీఏవో రవీందర్‌సింగ్, మార్కెటింగ్ ఏడీ గజానంద్ పాల్గొన్నారు.


