ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలో 12 రోజుల పా టు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గణపతి నిమజ్జన శోభయాత్రను శనివారం పరిశీలించారు. అలాగే డోలరా సమీపంలోని పెన్‌గంగ నది వద్ద నిమజ్జనాన్ని పరిశీలించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఉత్సవాల విజయవంతానికి కృషి చేసిన పోలీసు యంత్రాంగం, విద్యుత్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖలతో పాటు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. పట్టణంతో పాటు ఉట్నూర్, ఇచ్చోడ తదితర ప్రాంతాల్లోనూ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చివరి రోజు పెన్ గంగ వద్ద నిమజ్జన ప్రక్రియను ఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, అదనపు ఎస్పీలు పి. మౌనిక, బి.సురేందర్‌రావు, డీఎస్పీ ఎం.వెంకట నర్సయ్య పాల్గొన్నారు.


