మహనీయుడు మన్మోహన్‌సింగ్‌ | - | Sakshi
Sakshi News home page

మహనీయుడు మన్మోహన్‌సింగ్‌

Sep 27 2026 12:46 AM | Updated on Sep 27 2026 12:46 AM

కై లాస్‌నగర్‌: ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి బాటలు వేసిన మహనీయుడు డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ అని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ నరేశ్‌ జాదవ్‌ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జయంతిని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో ఆదిలా బాద్‌ మార్కెట్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి నాయకులు సంజీవరెడ్డి, అశోక్‌, సంజీవ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement