తలమడుగు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని కజ్జర్ల ప్రాథమిక పాఠశాలలో ఎంపీ నిధులతో శనివారం నిర్మించిన కాంపౌండ్‌ను పరిశీలించారు. అంగన్‌మిలాన్ కార్యక్రమం నిర్వహిచారు. అంగన్‌వాడీ కార్యకర్తలను, ఆయాలను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యతోనే భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, ఉప సర్పంచ్ గంగన్న, గ్రామ పెద్ద చింతలపల్లి దేవారెడ్డి, హెచ్‌ఎం జ్యోతి, శంకర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


